Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జమ్ముకాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఇవాళ దారుణం చోటుచేసుకుంది. అష్ముకం ఏరియాకు చెందిన జావేద్ అహ్మద్ అనే మానసిక రోగి కన్నతల్లిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిపై కౄరంగా దాడికి పాల్పడ్డాడు. అతడి దాడిలో జావేద్ తల్లితోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. వారిపై
మృతుల్లో నిందితుడి తల్లి హఫీజాతోపాటు గులాంనబీ, మొహమ్మద్ అమిన్ ఉన్నారు. ఇదే దాడిలో గాయపడిన మరో ఏడుగురిని స్థానికులు సమీప ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జావేద్ అహ్మద్ ఉదయాన్నే మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవకు దిగాడని స్థానికులు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తేలింది. తల్లిపై ఇష్టారీతిన దాడి చేస్తుండటంతో ఇరుగుపొరుగు అడ్డుకునే ప్రయత్నం చేశారని, దాంతో వారిపై కూడా దాడికి పాల్పడ్డాడని, ఇలా మొత్తం 10 మందిపై దాడి చేయగా ముగ్గురు మరణించారని, ఏడుగురు గాయాలతో ఆస్పత్రి పాలయ్యారని స్థానికులు పోలీసులకు తెలిపారు.