Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ తరుణంలో ఎన్వీ రమణ మాట్లాడుతూ మనలో ఒకరు పైకి రావడం ఉన్నత స్థాయికి ఎదగడం తోటివారికి ఇష్టం ఉండదు. భాషా విషయంలో తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తెలుగు సంస్కృతికి బెజవాడ రాజధానిగా ఉండేది. కానీ రాను రాను ఆ ప్రభావం కోల్పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు 2007లో మొదలైన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2011, 2015, 2019లలో జరిగాయి.