Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న 581 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్ పోస్టులతో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధిత దరఖాస్తులను జనవరి 6 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.
వివిధ ఖాళీల పోస్టుల వివరాలు:
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1(ట్రైబల్ వెల్ఫేర్) -05, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2(ట్రైబల్ వెల్ఫేర్) – 106, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 మహిళలు (ఎస్సీ డెవలప్‌మెంట్) -70, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 పురుషులు (ఎస్సీ డెవలప్‌మెంట్) – 228, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 (బీసీ వెల్ఫేర్) – 140, వార్డెన్ గ్రేడ్, 1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 05, మ్యాట్రన్ గ్రేడ్ -1 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03, వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 03, మ్యాట్రన్ గ్రేడ్ -2 డైరెక్టర్ ఆఫ్ డిసబుల్డ్ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ – 02, లేడి సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ఇన్ వుమెన్ డెవపల్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ – 19