Authorization
Fri May 16, 2025 01:01:59 pm
హైదరాబాద్: మహారాష్ట్రలోని లాతూర్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. తాజాగా అసోంలోని కొక్రాజార్‌లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ తరుణంలో తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి రాజ్యసభలో శుక్రవారం లేవనెత్తారు. భవిష్యత్ అవసరాలకు కూడా సరిపోయేలా కోచ్‌ల తయారీ సామర్థ్యం ప్రస్తుతానికి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనిలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వమని కేంద్రం స్పష్టం చేసింది.