Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట కూడా దరఖాస్తులు
- పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ నుంచి కూడా అప్లికేషన్
హైదరాబాద్: టీమిండియా సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ తరుణంలో సెలక్షన్ ప్యానల్ లోని ఐదు పోస్టుల కోసం 600 ఈమెయిల్ అప్లికేషన్లు వచ్చాయి. దీనిలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట కూడా దరఖాస్తులు రాదడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. అంతే కాకుండా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ నుంచి కూడా అప్లికేషన్ రావడం విశేషం. అయితే నిజానికి ఇవన్నీ తప్పుడు దరఖాస్తులు. స్పామ్ ఈమెయిల్ ఐడీల నుంచి కొందరు ఆకతాయిలు వీటిని పంపించినట్లు తెలిసింది. మరోవైపు తమకు వచ్చిన దరఖాస్తుల్లో 10 మంది హైప్రొఫైల్ క్యాండిడేట్లను బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఆ తర్వాత వీరికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఐదుగురిని సెలెక్ట్ చేయనుంది.