Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఏపీలో ఇటీవల ఏపీఎస్పీ, సివిల్ పోలీస్ విభాగంలో 6,511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ద్వారా 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఎస్సై ఉద్యోగాలకు 21-27 ఏళ్ల మధ్య వయసు వారు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18-24 ఏళ్ల మధ్య వయసు వారు అర్హులని నోటిఫికేషన్ లో తెలిపింది. అయితే సుదీర్ఘకాలం తర్వాత పోలీసు ఉద్యోగ నియామకాలు చేపడుతున్నందున వయోపరిమితి సడలిస్తే అత్యధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం కలుగుతుందన్న విజ్ఞప్తులు వచ్చాయి.
దీంతో వాటిని ఏపీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితిని రెండేళ్లు పెంచాలని ఆదేశాలు జారీ చేశారు.