Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పంజాబ్: దేశ సరిహద్దుల్లో అంతర్జాతీయ నియంత్రణ రేఖ వెంట 9 పాకిస్థాన్ డ్రోన్లను సరిహద్దు భద్రతా దళం కూల్చివేసింది. అమృత్‌సర్‌లోని పుల్మోరన్ సరిహద్దు పోస్ట్ సమీపంలో శుక్రవారం పాకిస్థాన్ మానవరహిత వైమానిక వాహనం (డ్రోన్)పై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపి దాన్ని కూల్చివేసింది. అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు తరచూ భారత సరిహద్దుల్లోకి వస్తున్నాయి.పాక్ డ్రోన్లు 25 కిలోలను మోసుకెళ్లగల సామర్థ్యంతో డ్రగ్స్, పేలుడు పదార్థాలను భారత్‌లోకి పంపుతున్నాయని బీఎస్ఎఫ్ గుర్తించింది.
అధికారిక రికార్డుల ప్రకారం2021 వ సంవత్సరం అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022లో 24 పాక్ డ్రోన్‌లను బీఎస్ఎఫ్ కూల్చివేసింది.పాకిస్థాన్ డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, డ్రగ్స్, పేలుడు పదార్థాల అక్రమ రవాణాపై గట్టి నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. దీంతో సరిహద్దు కాపలా దళం ఈ ముప్పును ఎదుర్కోవటానికి ఇటీవల కొత్త వ్యూహాలను అనుసరించింది.డ్రోన్‌ల నుంచి వచ్చే శబ్దాలతో వాటి లక్ష్యంగా కాల్పులు జరపడం కాకుండా, సరిహద్దుల్లో జీపీఎస్ ద్వారా మ్యాప్ చేసి, క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు. హాని కలిగించే ప్రదేశాలలో పెట్రోలింగ్ పెంచామని పేరు చెప్పని ఓ సైనిక అధికారి తెలిపారు.