Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సినీపరిశ్రమలో ఉండే అసమానతల గురించి స్టార్ హీరోయిన్ నయనతార స్పందించింది. హీరోలకు ఇచ్చేంత ప్రాధాన్యతను హీరోయిన్లకు ఇవ్వరని... అందుకే తాను సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం మానేశానని ఆమె తెలిపింది. తాను హీరోయిన్ గా రెండో దశాబ్దంలోకి ప్రవేశించిన తర్వాత తనకంటూ కొన్ని కలలు ఉండేవని... మహిళా ప్రాధాన్యత ఉండే సినిమాలు చేయాలనే కోరిక ఉండేదని చెప్పింది. అయితే ఉమెన్ సెంట్రిక్ సినిమాలను ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేకపోయేవారే అర్థమయ్యేది కాదని తెలిపింది. హీరోయిన్లు ఏదైనా ఆడియో ఫంక్షన్ కు హాజరైనా మమ్మల్ని ఏ మూలనో నిలబెట్టే పరిస్థితి ఉండేదని చెప్పింది. ఈ కారణాల వల్లే తాను సినిమా ఈవెంట్లకు వెళ్ళడం మానేశానని తెలిపింది. నయనతార లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం కనెక్ట్. అశ్విన్ శరవనన్ దర్శకత్వంలో హర్రర్ థ్రిల్లర్స్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొని, విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.