Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రేటర్ నోయిడా: ఆగంతకులు ఎముకలు కొరికే చలి...ముళ్ల పొదల్లో వదిలి వెళ్లిన పసికందును పోలీసు అధికారి భార్య చేరదీసి తన పాలిచ్చి కాపాడిన ఘటన గ్రేటర్ నోయిడాలో తాజాగా వెలుుగుచూసింది. గుర్తుతెలియని వ్యక్తులు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్కు ప్రాంతంలో గుడ్డలో చుట్టి పసికందుని చలిలో వదలడంతో, ఆ పసికందు గుక్కపట్టేలా ఏడుస్తోంది. తీవ్ర చలి, ఆకలితో ఏడుస్తున్న పసికందును గ్రేటర్ నోయిడా పోలీసులు పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారు. తీవ్ర ఆకలితో ఏడుస్తున్న పసికందుకు పోలీసు అధికారి భార్య జ్యోతి సింగ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన స్థన్యం అందించి పాలిచ్చి కాపాడారు. అనంతరం ఆ పసికందును ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో ఆ పసికందు కోలుకుంటోందని వైద్యులు చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే పసికందులను అనాథ శరణాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చి ఇవ్వాలని జ్యోతిసింగ్ సూచించారు.అత్యంత దయనీయంగా పసికందులను బయట పడేయవద్దని జ్యోతిసింగ్ కోరారు. ఆకలితో ఏడుస్తున్న అనాథ పసికందుకు తన పాలిచ్చి ఆదుకున్న జ్యోతిసింగ్ ను పలువురు అభినందించారు.