Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రకు డీఎంకే ఎంపీ కనిమొళి సంఘీభావం ప్రకటించారు. హర్యానాలో పర్యటిస్తున్న రాహుల్‌ను శుక్రవారం కలుసుకున్న కనిమొళి ఆయనతో పాటు నడిచారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, రాబోయే పార్లమెంటు ఎన్నికలపై వారు మాట్లాడుకున్నట్లు సమాచారం. కాగా, రాహుల్ పాదయాత్రలో శనివారం ఢిల్లీలో మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ పాల్గొననున్న విషయం తెలిసిందే. రాహుల్ భారత్ జోడో యాత్రను కన్నియా కుమారిలో స్టాలిన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.