Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న సెస్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. 15 మంది డైరెక్టర్లను ఎన్నుకునేందుకు పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల బరిలో మొత్తం 75 మంది ఉండగా.. 87,130 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 202 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. ప్రతిష్ఠాత్మక సెస్ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న సెస్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉండి మరిన్ని సేవలు అందేలా చేసేందుకు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో సెస్‌లో నమోదై ఉన్న విద్యుత్ వినియోగదారులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కాగా, వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో పోలింగ్ తీరును రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల అథారిటీ సుమిత్ర, సెస్ ఎన్నికల అధికారి మమత పరిశీలించారు. బూత్‌లోని సిబ్బందితో మాట్లాడి పోలీంగ్ సరళిని తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే వినియోగదారులు ఓటు వేసేందుకు బారులు తీరారు.
52 ఏండ్ల క్రితం సెస్‌ను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, గత పాలకులు సెస్‌ను పట్టించుకోకపోవడంతో కళ కోల్పోయింది. 2014 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన సహాయసహకారాలు అందజేయడం మొదలుపెట్టడంతో సెస్‌కు తిరిగి జీవం వచ్చింది. ప్రస్తుతం 2.72 లక్షల పైచిలుకు వినియోగదారులకు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ వెలుగులు అందిస్తున్నది.