Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనంతపురం: జిల్లాలోని శింగనమల కేజీబీవీలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. ఒకే నెలలో రెండోసారి ఫుడ్‌పాయిజన్‌తో విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. దాదాపు 40 మంది అస్వస్థతకు గురవ్వగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అధికార వైసీపీ స్థానిక నేతల కనుసన్నల్లో కేజీబీవీ నడుస్తోంది. స్థానిక వైసీపీ నేతలు, సిబ్బంది మధ్య తగాదాల వల్లే పిల్లలకి అందించే భోజనంలో బల్లి వేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాల నేతలపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ‘‘మందు తాగి వచ్చారు.. బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేయండి’’ అంటూ పోలీసులకు సూచించారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యాఖ్యలు నిరసిస్తూ విద్యార్థి సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.