Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కైకాల సత్యనారాయణ నిన్న తెల్లవారుజామున 4 గంటల సమయంలో అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాదులోని అపోలో హాస్పిటల్స్ లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ దిగ్గజ నటుడిని కడసారి చూడడానికి సినీ రాజకీయ లోకం తరలివచ్చింది. నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ పార్తివదేహానికి ఆంధ్రప్రదేశ్ సీఎంతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పించారు. మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికారికంగా జరపనున్నారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ మరణించిన విషయం తెలిసిందే. తెలుగు నట శిఖరం కైకాల సత్యనారాయణ చివరి చూపు కోసం సినీ రాజకీయ ప్రేక్షక వర్గం తరలివచ్చింది.. ఆయన భౌతిక కాయానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా నివాళులర్పించారు. కైకాల అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని సీ ఎస్ ను ఆదేశించారు.
దివికేగిన దిగ్గజ నటుడికి తెలుగు తారా లోకం నివాళులర్పిస్తోంది. గ్రేట్ యాక్టర్ వెళ్లిపోయిన క్యారెక్టర్ ఎప్పటికీ ఎన్నటికీ మిగిలే ఉంటుంది. ఆయన మనల్ని ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటారు. ఏది ఏమైనా కైకాల సత్యనారాయణ లోకాన్ని విడిచి వెళ్లడం నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పాలి.