Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగారెడ్డి: అమీన్‌పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీవాణినగర్‌లో దారుణం జరిగింది. భార్య, కుమారుడు, వదినపై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వదిన సుజాత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భార్య సునీత, కుమారుడు సాయికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న సునీత, సాయిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాస్ కత్తితో దాడి చేయడానికి, కుటుంబ తగాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.