Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా రిలయన్స్ జియో తన చందాదారులకు కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 2023 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ.. 2023 ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 252 రోజులు. అపరిమిత కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్ లు, రోజువారీ 2.5 జీబీ డేటా పొందొచ్చు. వీటికి అదనంగా రిలయన్స్ జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక రూ.2,999 ప్లాన్ ను జియో ఇప్పటికే అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఏడాది కాగా, అదనంగా మరో 23 రోజుల వ్యాలిడిటీని ఆఫర్ చేస్తోంది. రోజువారీ 2.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. జియో యాప్స్ ను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
రూ.2,874 ప్లాన్ లో రోజువారీ 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అపరిమితంగా ఉచిత కాల్స్ పొందొచ్చు. అలాగే, రూ.2,545 ప్లాన్ ను 336 రోజుల వ్యాలిడిటీతో పొందొచ్చు. రోజువారీ 1.5 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. 100 ఎస్ఎంఎస్ లు ఉచితం. కాల్స్ కూడా ఉచితం. అన్ని ప్లాన్లలోనూ జియో యాప్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు.