Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరిగాయి. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మి నారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకు ముందు కైకాల పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు.