Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నూతన సంవత్సర వేడుకలే టార్గెట్‌గా నగరంలోకి ఈ ముఠా డ్రగ్స్ తీసుకొచ్చింది. చెన్నై కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్‌తో కలిసి నార్త్‌జోన్ పోలీసులు దాదాపు మూడు కోట్లు విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.