Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్: విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ వ్యక్తితో గొడవ పడ్డ కానిస్టేబుల్.. అనంతరం బట్టలు విప్పేసి హంగామా సృష్టించాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. హర్దా పట్టణంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుశీల్ మాండవి అనే వ్యక్తి పీకల దాకా మద్యం సేవించాడు. అయితే రోడ్డుపై వెళ్తూ.. అర్ధనగ్నంగా ఉన్న ఓ వ్యక్తితో కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో వారిద్దరిని జనాలు చుట్టుముట్టారు. ఓ వైపు అతనితో గొడవ పడుతూనే.. కానిస్టేబుల్ తన షర్ట్‌ను విప్పేశాడు. అంతటితో ఆగకుండా తన ప్యాంట్‌ను కూడా విప్పి కూర్చున్నాడు. తన బట్టలను స్థానికులపైకి విసిరేశాడు. ఈ తతంగాన్ని స్థానికులు తమ కెమెరాల్లో బంధించి, వైరల్ చేశారు. ఈ వీడియోలు పోలీసుల దాకా చేరాయి. హర్దా జిల్లా ఎస్పీ మనీశ్ కుమార్ అగర్వాల్ స్పందించారు. మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరు నెలల క్రితం మాండవి మద్యం సేవించి వాహనం నడపడంతో రోడ్డుప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.