Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి: రైతులు లాభసాటి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సాంప్రదాయ సాగు నుంచి రైతాంగం బయటకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద మందడి మండలం చిన్నమందడి గ్రామంలో నాలుగు ఎకరాలలో సీతాఫలం తోటను సాగు చేసిన రైతు శ్రీకాంత్ రెడ్డి సీతాఫలాలను శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రికి అందజేశారు. ప్రత్యామ్నాయ పంటను సాగుచేసిన రైతును మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. నూనెగింజలు, పప్పుగింజలు, ఉద్యానపంటలతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగును ఎంపిక చేసుకోవాలని సూచించారు. నగరాలు, పట్టణాల సమీపంలోని రైతులు కూరగాయల సాగును ప్రణాళికాబద్ధంగా ఎంపిక చేసుకోవాలని చెప్పారు. ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై నాణ్యమైన కూరగాయల నారు అందించడం జరుగుతున్నదని తెలిపారు. రైతులు వ్యవసాయ, ఉద్యాన అధికారుల సలహాలు, సూచనలు స్వీకరించాలి. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి అందుబాటులో ఉన్నారని మంత్రి తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోత్సాహంతో ఇప్పటికే 200 మంది రైతులు కూరగాయల సాగు వైపు దృష్టి సారించారు.