Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహబూబ్‌నగర్: అర్హుల రందరూ ఓటు హక్కు కలిగి ఉండాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. నూతన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో తాసిల్దార్లతో ఓట రు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై శుక్రవారం సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోను ఆనర్హులకు ఓటు హక్కు కల్పించకూడదని తెలిపారు. ఫారం-7 దరఖాస్తు పరిశీలించకుండా ఏ ఒక్క ఓటును తొలగించొద్దని తె లిపారు. ఆధార్ అనుసంధానాన్ని పెంచాల ని, ఈపీ, లింగ నిష్పత్తిని జాగ్రత్తగా సరి చూసుకోవాలన్నారు. ఈఆర్వోలు తప్పనిసరిగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై ఎప్పటికప్పుడు తాసిల్దార్లతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఫారం-6తోపాటు తదితర పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేకంగా సమీక్షించారు. వంద ఏండ్లు పై బడిన ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. క్రీడా ప్రాంగణాలకు సంబంధించి ఎంపీడీవోలు, తాసిల్దార్లు సమర్పించే నివేదిక ఒకేలా ఉండాలన్నారు. ఎక్కడైనా స్థలాలను గుర్తించాల్సి ఉంటే త్వరగా గుర్తించి నివేదికను పంపాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్‌డీవో యాదయ్య, ఆర్డీవో అనిల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, ఏవో శంకర్, ఆయా మండలాల తాసిల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.