Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు మంత్రి హరీశ్ రావు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ఆనందోత్సహాలతో ఈ పర్వదినాన్ని వేడుకగా జరుపుకోవాలన్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా బట్టలు పంపిణీ చేసిందని తెలిపారు. యేసు ప్రభు దీవెనలతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశ స్ధాయి లో అమలు అయ్యేలా బి ఆర్ ఎస్ పార్టీ ని దేశంలో గుణాత్మక మార్పు తెచ్చాల ఆశీర్వదాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.. ఈ పర్వదినాన్ని కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో వేడుకగా జరుపుకోవాలని కోరుకున్నారు.