Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బంగ్లాదేశ్, టీమిండియా జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్ లో బంగ్లా 231 పరుగులకు ఆలౌట్ అయింది. 7/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా... ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షాంటో(5)అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగగా, మొమినుల్ హక్(5) సిరాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన బంగ్లా బ్యాట్స్ మెన్స్ భారత బౌలర్ల దెబ్బకు ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయారు. 195 పరుగులు వద్ద ఏడో వికెట్ కోల్పోయిన బంగ్లాకు మరో వికెట్ పడకుండా లిటన్ దాస్ (73), తస్కిన్ అహ్మద్ (31) ఆచితూచి ఆడారు. ఇద్దరు కలిసి ఎనిమిదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లిటన్ దాస్ ఔటైన తరువాత మిగతా రెండు వికెట్లను కూడా బంగ్లా త్వరగానే కోల్పోయింది. దీంతో టీమిండియా టార్గెట్ 145 పరుగులుగా ఉంది. కాగా బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసింది.