Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీహెచ్ఎంసి నిధులు వెంటనే విడుదల చేయండి
- కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ..
నవతెలంగాణ బంజారాహిల్స్
జీహెచ్ఎంసి పరిధిలోని ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు జీహెచ్ఎంసి కౌన్సిల్ హాలు బయట ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. జీహెచ్ఎంసికి ఇవ్వాల్సిన నిధులు కేటాయించి ప్రజల అభివృద్ధికి తోడ్పాటున అందించాలని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశానికి ముందు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పి విజయ రెడ్డితో సహా ఇతర కార్పొరేటర్లు ఎస్.ఆర్. డి.పి అప్పులను, బకాయి ఉన్న ఆస్తి పన్నును వెంటనే చెల్లించి నిధులు విడుదల చేసి నాలాలను అభివృద్ధిపరిచి పౌరుల ప్రాణాలు కాపాడాలాని దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రజలు అనారోగ్యాన బారిన పడకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.