Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పేద ప్రజలకు మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యం ఉచితంగా ఉంది. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల బియ్యం అందిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గోధుమలు కూడా ఇస్తోంది. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ 2020 నుంచి ఉచిత రేషన్ ను పొడిగిస్తూ వస్తోంది.
ఈ క్రమంలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ వచ్చే ఏడాది డిసెంబర్ వరకూ పేదలకు ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనను జాతీయ ఆహార భద్రతా జట్టలో డిసెంబర్ 202 వరకు విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని కేంద్రం తెలిపింది.