Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాలపై బాలయ్య మార్కును ఎక్కువమంది ఇష్టపడతారు. ఆ తరహా కథల్లో ఆయనకి బ్లాక్ బస్టర్ హిట్లు తెచ్చిపెట్టిన సినిమాలే ఎక్కువ. ఈ జోనర్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన బాలయ్య, మళ్లీ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'మా బావ మనోభావాలు' అనే సాంగును వదిలారు. హైదరాబాద్ .. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని 'సంధ్య 35 వీవీ'లో నిర్వహించిన ఈవెంట్ ద్వారా ఈ సాంగును రిలీజ్ చేశారు. 'చుడీదారు ఇష్టమంట ఆడికీ .. వద్దొద్దన్న ఎండలకాలం ఏడీకి' అంటూ ఈ పాట మొదలవుతోంది.
బాలకృష్ణ .. చంద్రిక రవి .. హనీరోజ్ బృందంపై ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను. సాహితి చాగంటి .. యామిని .. రేణు కుమార్ ఆలపించారు. జానపద బాణీలో ఈ పాట హుషారుగా సాగుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.