Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమెరికా మాల్‌లో శుక్రవారం పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 19 ఏళ్ల యువకుడు చనిపోయాడని బ్లూమింగ్‌టన్ పోలీస్ చీఫ్ బూకర్ హోడ్జెస్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వారిలో ఒకరు తుపాకీ తీసి కాల్పులు జరిపారు. బాధితుడిపై అనేక మార్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన తర్వాత 'మాల్ ఆఫ్ అమెరికా'ను మూసేశారు. కాల్పుల ధ్వని షాపర్లను భయభ్రాంతులకు గురిచేసింది. మాల్‌ను గంటపాటు లాక్‌డౌన్ చేసేశారు. బ్లూమింగ్‌టౌన్ పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారని ఆ మాల్ ప్రకటించింది.