Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : త్వరలోనే హైదరాబాద్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై శనివారం ఆర్టీసీకి చెందిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో కలిసి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీ చరిత్రలో పెద్ద ఎత్తున బస్సులు కొనుగోలు చేశామన్నారు. త్వరలోనే ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. సమిష్టి కృషితో ఆర్టీసీ అద్భుతంగా ముందుకెళ్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి మాట్లాఉడూత సీఎం సహకారంతో రాష్ట్రంలో భారీగా బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఏటా బడ్జెట్‌లో రూ.500కోట్లు సీఎం కేసీఆర్ కేటాయిస్తున్నారని, ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది కృషి వల్లే ప్రతి నెలా నష్టాలు తగ్గుతున్నాయన్నారు. డీజిల్ ధరలు పెరిగిన ఆర్టీసీ చార్జీలు పెంచలేదని, సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చినట్లు వివరించారు.