Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ముంబయి: వీడియోకాన్ గ్రూప్ కేసులో అరెస్టయిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ను కోర్టు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో కొచ్చర్ దంపతులను సీబీఐ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన విషయం విధితమే. వీరిని శనివారం ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చారు. విచారణకు వారు సహకరించడం లేదని, అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానలు చెప్పడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. దీంతో సీబీఐ అభ్యర్థన మేరకు కోర్టు కొచ్చర్ దంపతులను డిసెంబరు 26 వరకు కస్టడీకి అప్పగించింది.