Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చైనా తదితర దేశాల్లో కోవిడ్-19 మహమ్మారి మరోసారి సవాల్ విసురుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపడుతుంది. ఇన్ఫెక్షన్లు పెరగకుండా నిరోధించేందుకు నిరంతర నిఘా పెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో దీటుగా వ్యవహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెడికల్ ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. కోవిడ్ నిరోధక మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రజలను కోరారు.
మన దేశంలో రోజువారీ కోవిడ్-19 కేసుల సంఖ్య ప్రతి వారం తగ్గుతోంది. అయితే శనివారం ఉదయం 8 గంటలకు విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ కేసుల సంఖ్య 201కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 3,397. కోవిడ్-19 మహమ్మారి మేనేజ్‌మెంట్ కోసం మెడికల్ ఆక్సిజన్ క్రమబద్ధంగా, నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం లేఖ రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్ కాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చేవారికి తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్ చేయాలి. ఈ పరీక్షలో కోవిడ్ లక్షణాలు కనిపించినవారిని వెంటనే క్వారంటైన్‌కు పంపిస్తారు.