Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: చిన్నారి కృతిక మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా 7 గంటల్లో కేసును ఛేదించామని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి తెలిపారు. ఆరేళ్ల కృతికను.. వాళ్ల అవ్వ ఇంటి నుంచి ఓ వ్యక్తి తీసుకెళ్లాడని డీసీపీ అన్నారు. నిందితుడు ఇంటి దగ్గర హోటల్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించామని, హోటల్లో పనిచేసే వ్యక్తి కృతికను ఆటోలో తీసుకెళ్లాడని డీసీపీ పేర్కొన్నారు. జూబ్లీ బస్స్టేషన్ నుంచి సిద్దిపేట జిల్లా ధూల్మిట్టకు వెళ్లారని, చిన్నారి స్టేట్మెంట్ రికార్డ్ చేశామని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి వెల్లడించారు.