Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దుబాయ్‌లోని అల్-బర్షా ప్రాంతంలో జులైలో ఓ కారు ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ వ్యక్తి తన వాహనాన్ని ప్రధాన రహదారి నడిమధ్యలోనే నిలిపి, రివర్స్ చేస్తుండగా మరో కారులో ఉన్న భారతీయుడు అది గమనించకుండా దాన్ని ఢీ కొట్టాడు. దీంతో ఈ రెండు కార్లూ సౌదీ అరేబియాకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తోన్న మూడో కారును ఢీకొన్నాయి. దీంతో ఆ కారులోని ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
ఈ తరుణంలో దీనిపై విచారణ జరిపిన దుబాయ్ కోర్టు భారతీయుడితోపాటు బంగ్లాదేశ్‌కి చెందిన మరో వ్యక్తికి దాదాపు రూ.90 లక్షల (4 లక్షల ఏఈడీలు) జరిమానా విధించింది. ఈ కేసులో స్థానిక ట్రాఫిక్ కోర్టు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది. ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన డ్రైవర్‌కు దాదాపు రూ.45 వేలు (2 వేల ఏఈడీలు) జరిమానా విధించడంతోపాటు బాధిత కుటుంబానికి పరిహారంగా దాదాపు రూ.18 లక్షలు(80 వేల ఏఈడీలు) అందజేయాలని ఆదేశించింది. మొత్తం రూ.90 లక్షల్లో మిగతా మొత్తాన్ని బంగ్లాదేశ్ వ్యక్తి చెల్లించాలని తెలిపినట్లు తెలుస్తుంది.