Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: కరోనా పుట్టిళ్లు చైనాలో మహమ్మారి కోరలు చాచిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో ఇకపై రోజువారీ గణాంకాలు వెల్లడించేది లేదని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. గత కొంతకాలంగా ఎన్‌హెచ్‌సీనే దేశంలోని కేసుల సంఖ్యను వెల్లడిస్తూ వస్తున్నది. అయితే స్పష్టమైన కారణాలు తెలియనప్పటికీ ఆదివారం నుంచి తాము రోజువారీ కరోనా కేసులను ప్రకటించేది లేదని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఇకపై చైనీస్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఫర్ రెఫరెన్స్ అండ్ రిసెర్చ్.. కరోనా కేసులను వెల్లడిస్తుందని పేర్కొన్నది. అయితే సీడీసీ ఎప్పటినుంచి ఈ సమాచారం అందిస్తున్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.