Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జీడిమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెహ్రునగర్ లో అతివేగంతో దూసుకువచ్చిన బైక్ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాజులరామారం నుంచి శాపూర్‌నగర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు బేగరి క్రాంతి కుమార్, ఔల సందీప్‌గా పోలీసులు గుర్తించారు. ఈప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.