Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గ్రేటర్ ప్రయాణికులకోసం ఆర్టీసీ త్వరలో 10 డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ విషయంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ స్పష్టత నిచ్చారు. పర్యాటకులతోపాటు నగరవాసుల్ని ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫేమ్ 2 కింద త్వరలో 300 ఎలక్ర్టిక్ బస్సులను గ్రేటర్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే, మరో 500 ఎలక్ర్టిక్ బస్సులను సైతం కొనుగోలు చేయనున్నామన్నారు. గ్రేటర్‌జోన్‌పై ప్రత్యేక దృష్టిసారించామని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా క్రమంగా బస్సుల సంఖ్య పెంచేదిశగా చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.