Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమికుల జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పార్లపల్లె, కందవాతి గ్రామాలకు చెందిన అనిత, కుమార్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య వరస కుదరదని పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఈ ప్రేమ జంట కర్ణాటకకు వలస వెళ్లి నివాసముంటుంది. శనివారం రాత్రి వీరిద్దరూ రాయచూరు జిల్లా యాదగిరి దగ్గర రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.