Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బెంగళూరు: గనుల అక్రమ తవ్వకాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్దన్‌రెడ్డి కొత్త పార్టీని స్థాపించారు. బీజేపీ నాయకత్వం ఆయన్ను బుజ్జగించేందకు రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ, పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన నేడు కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. గాలి జనార్దన్ కొత్త పార్టీ పెట్టడం వల్ల కొన్ని వర్గాల ఓట్లపై ప్రభావం చూపవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేసినట్టు సమాచారం. ఆ క్రమంలోనే ఆయన భార్యతో కలిసి నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజలతో మమేకయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంగావతిలోని ఓ అభివృద్ధి కార్యక్రమానికి రూ.6కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు గాలి జనార్దన్ ఇటీవల ప్రకటించారు. ఇది బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా ఆ పార్టీ అధినాయకత్వానికి జనార్దన్‌రెడ్డి దూరంగా ఉంటున్నారు.