Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉదయం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా చేపట్టిన సెర్చింగ్ ఆపరేషన్‌లో భారీగా మారణాయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైంది. ఉత్తర కశ్మీర్‌లోని యూరి సెక్టార్ బారాముల్లా జిల్లా హల్తంగా ఏరియాలో స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా ఆ యుద్ధసామాగ్రి దొరికింది. కూంబింగ్ సందర్భంగా హల్తాంగా ఏరియాలో పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రి లభించిందని రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి చెందిన కల్నల్ మనీష్ పుంజ్ చెప్పారు. అందులో 24 మాగజీన్లతో ఎనిమిది AKS 74 రైఫిల్స్ , 560 లైవ్ రైఫిల్ రౌండ్స్, 24 మాగజీన్‌లతో 12 చైనీస్ పిస్తోల్‌లు, 224 లైవ్ పిస్తోల్ రౌండ్స్, 14 పాకిస్థాన్, చైనా గ్రెనేడ్స్, పాకిస్థాన్ జెండాతో కూడాని 81 బెలూన్‌లు ఉన్నాయని తెలిపారు.