Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గోవిందరావుపేట
ప్రజలందరూ సమిష్టిగా సంఘటితంగా సుఖ శాంతులతో జీవించాలని పాస్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని పసరలో పెంతకోస్తూ దేవుని సంఘంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పసర పోలీస్ స్టేషన్ ఏఎస్ఐలు సత్యనారాయణ సర్వోత్తమ్ రెడ్డిలు మరియు పసర పంచాయితీ ఉపసర్పంచ్ బద్దం లింగారెడ్డిలు హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ చెడు మార్గాన్ని త్యజించి సన్మార్గంలో పయనిస్తూ ఏసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ జీవించాలని ఉపదేశం బోధించారు. ఈ కార్యక్రమంలో ఉప్పు మోజేష్, జోసెఫ్ సామెల్, నరసయ్య, ప్రసంగి, జోెయేలు, జ్యోతి రాణి, మహేష్, ఏసు పాదం, రమేష్, రాజు సంఘం పెద్దలు పాల్గొన్నారు.