Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఫుట్‌బాల్ ఆల్ టైమ్ గ్రేట్ పీలే ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షిణించింది. గొప్ప బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా పేరుగాంచిన పీలే.. ప్రస్తుతం సావో పాలో దవాఖానలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యులు ఆయనను ప్రత్యేక పరిశీలనలో ఉంచారు. అతని ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తున్నదని, ఇది మూత్రపిండాలు, గుండెపై ప్రభావం చూపుతున్నదని వైద్యులు చెప్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న 82 ఏండ్ల వెటరన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు క్రిస్మస్ వేడుకలను హాస్పిటల్‌లోనే జరుపుకున్నారు. ఆదివారం ఉదయం పీలే కుమార్తె కెల్లీ నాసిమెంటో ఇన్‌స్టాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఫీఫా ప్రపంచ కప్ ప్రారంభం సందర్భంగా పీలే తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో ఒక ఫొటోను పోస్ట్ చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు.. తెలిపారు.
రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రిలో చేరిన పీలే ఆరోగ్యం క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. పీలేకు గుండె సంబంధ సమస్యలు ఉన్నాయి. కీమోథెరపీ చికిత్సకు స్పందించకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దప్రేగు కణితిని గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించారు. ఆ తర్వాత అతడికి కీమోథెరపీ జరిగింది. గతంలో పీలే చాలాసార్లు ఆసుపత్రి పాలయ్యాడు. క్రిస్మస్ సందర్భంగా తమ తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ప్రేమకు ధన్యవాదాలు. అంటూ పీలే కుమార్తె కెల్లీ ట్వీట్ చేశారు.