Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరోజ లక్ష్మి ఉపాధ్యాయురాలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
తాము పాఠాలు చెప్పిన శిష్యులు భవిష్యత్తులో అయితే గురువు ఎంతో సంతోషిస్తారని ఉపాధ్యాయురాలు సరోజ లక్ష్మి అన్నారు. ఆదివారం మండలంలోని చల్వాయి గ్రామంలో మహాత్మ జ్యోతిబాపూలే నేషనల్ అవార్డు గ్రహీత రేండ్ల సంతోష్ దంపతులను ఉపాధ్యాయురాలు సరోజ లక్ష్మీ దంపతులు సన్మానించారు. ఈ సందర్భంగా సరోజ లక్ష్మీ మాట్లాడుతూ తన శిష్యుడు సంతోష్ నేషనల్ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పిల్లలుగా ఉన్నప్పుడు పాటలు చెప్పడమే కాదు పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు ఏదో ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే గురువులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్టు అవుతుంది అని కొనియాడారు అనంతరం అవార్డు గ్రహీత రేండ్ల సంతోష్ మాట్లాడుతూ నా చిన్నప్పుడు నాకు అ ఆ లు నేర్పించిన గురువు నన్ను సన్మానించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది అని అన్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షురాలు పూసాల మంజుల, చిటికనవేని వినోద, బక్కి దివ్య, కంది బిక్షపతి, కంది కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.