Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ డా.దుర్గం ప్రభాకర్
నవతెలంగాణ చివ్వేంల: మండల పరిధిలోని, ఖాసీంపేట నందు బేతెస్థ ప్రార్ధన మందిరంలో ఘనంగా క్రీస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, స్విట్స్ పంచి, 100 మంది క్రైస్తవులకు దుస్తులు పంపిణి చేసి, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. బిషప్ డా.దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వందల వేల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ అన్నారు .
దేవుడు మానవ రూపంలో మానవ జాతి పాపాలను తొలగించడానికి భూమిపైకి వచ్చాడని, అదే క్రిస్మస్ పండుగకు ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం లో సాగర్, తీతు , వెంకన్న, అనిల్, సుధాకర్, బాబు, ఉపేందర్, పేతురు, దావీదు, రాజు, సురేష్, నాగరాజు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.