Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాగారంలోని రాజారాం స్టేడియంలో నిర్వహించిన 18వ జాతీయ స్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ను బాలికల విభాగంలో నవ్య భారతి గ్లోబల్ స్కూల్ నిజామాబాద్, బాలుర విభాగంలో టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బోధన్ బాలుర విభాగంలో కైవసం చేసుకున్నారు. గత రెండు రోజులుగా నిర్వహించిన ఈ పోటీలు ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు హాజరైనారని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరాల రత్నాకర్ యు రాజా గౌడ్ తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నరాల రత్నాకర్ యు రాజా గౌడ్ జండా ఎత్తి ప్రారంభించారు. అజటివి భాగంలో 80 మీటర్ల పరుగు బాలుర విభాగంలో, బాలికల విభాగంలో 60 మీటర్ల పరుగు ,600 మీటర్ల పరుగు, 1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, బ్రాడ్ జంప్ హై జంప్ షాట్ పుట్ డిస్కస్ త్రో విభాగాలలో పోటీలను నిర్వహించారు. ఈ రెండు రోజుల అద్దేటిక్స్ పోటీలు హౌరాహోరీగా కొనసాగాయి. హోరా హోరీగా సాగిన ఈ పోటీలో అత్యధికంగా మెడల్ సాధించిన బాలికల విభాగంలో నవ్య భారతి గ్లోబల్ పాఠశాల, బాలుర విభాగంలో టీఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ బోధన్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నరాల రత్నాకర్ హాజరై క్రీడాకారుల ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల నుండి 600 మంది క్రీడాకారులు హాజరవడం విశేషమని ఈ క్రీడల్లో రాణించిన క్రీడాకారులు జాతీయస్థాయిలో సైతం రానించి జిల్లా కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు. ఈ పోటీల్లో మొదటి ద్వితీయ తృతీయ స్థానం సాధించిన క్రీడాకారులను మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆర్థెటిక్స్ కార్యదర్శి యు రాజా గౌడ్ మాట్లాడుతూ ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి జనవరి 12 నుండి 14వ తేదీ వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరగబోయే 18వ జాతీయస్థాయి పోటీలకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్సులు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.