Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఈ రెండు బైక్‌లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాకాగా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చిన్నారి సహా మొత్తం ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.