Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రెండో టెస్టులో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించిన రవిచంద్రన్ అశ్విన్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అశ్విన్ రికార్డు సృష్టించాడు.
గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెటర్ విన్స్‌టన్ బెంజమిన్ పేరిట ఉంది. 1808లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 40 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. మొదట బౌలింగ్‌లో 6 వికెట్లు తీసిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ అదరగొట్టాడు. శ్రేయాస్ అయ్యర్‌తో 71 పరుగులు జోడించి జట్టుని గెలిపించాడు. దాంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం టీమిండియా 99 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.