Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేపాల్ నూతన ప్రధానిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమాల్ దహాల్ ప్రచండ నియమితులయ్యారు. అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి ఆదివారం ఆయనను నియమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 క్లాజ్ 2 ప్రకారం ప్రచండను నియమించినట్టు అధ్యక్ష కార్యాలయం తెలిపింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రచండ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుపగా ఆదివారం సాయంత్రం 5 గంటలలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని బిద్యాదేవి భండారి ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గడువు ముగియడానికి ముందే ప్రచండ లేఖను సమర్పించారు.
అయితే 275 మంది సభ్యులున్న నేపాల్ ప్రతినిధుల సభలో ప్రచండకు 165 మంది సభ్యుల మద్దతు ఉంది. వీరిలో సీపీఎన్-యూఎంఎల్‌కు చెందిన 78, సీపీఎన్-ఎంసీకి చెందిన 32 మంది, ఆర్ఎస్‌పీకి చెందిన 20 మంది, ఆర్‌పీపీకి చెందిన 14 మంది జేఎస్పీకి చెందిన 12 మంది జనమత్‌కు చెందిన ఆరుగురు, నాగరిక్ ఉన్ముక్తి పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ఉన్నారు. అయితే ప్రచండ నేపాల్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది మూడోసారి.