Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఢిల్లీలో మెట్రో రైలు కార్యకలాపాలకు ఓ డ్రోన్ ఆటంకం కలిగించింది. జసోలా విహార్, షహీన్‌బాగ్ నుంచి బొటానికల్ గార్డెన్ వైపునకు వెళ్లే మెట్రో రైళ్లు కొద్దిసేపు ఆగిపోయాయి. భద్రత కారణాల వల్ల రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. మజెంట (ఎనిమిదో నంబర్) లైనులో సర్వీసులు ఆగిపోయినట్లు మధ్యాహ్నం 2.50 గంటలకు ఢిల్లీ మెట్రోరైల్ ట్వీట్ చేసింది. మిగతా లైన్లలో యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. దాదాపు గంట తర్వాత సర్వీసులు పునఃప్రారంభమైనట్లు మెట్రో రైలు సమాచారం ఇచ్చింది. డ్రోన్ ఘటనపై ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు. డాగ్ స్క్వాడుతో ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. డ్రోన్‌లో ఔషధాలు కనిపించాయి. అది నొయిడాకు చెందిన ఓ సంస్థ డ్రోన్ అని తేలింది. ఈ డ్రోనుకు డీజీసీఏ అనుమతి ఉందో.. లేదో పరిశీలిస్తున్నామని, దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మెట్రో డీసీపీ జె.మణి తెలిపారు.