Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూరత్‌లో పీపీ సవాని గ్రూప్ ఆధ్వర్యంలో.. తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఉన్న 300 మంది యువతులకు ఒకేసారి పెళ్లిళ్లు జరిపించారు. ఇందుకోసం భారీ వేదికను నిర్మించి.. వారివారి సంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేశారు. ఈ సందర్భంగా లక్ష మందితో అవయవ దానంపై ప్రతిజ్ఞను కూడా నిర్వహించారు. తల్లిదండ్రుల్లో ఒకరు మాత్రమే ఉన్న యువతులకు 2012 నుంచి పీపీ సవాని గ్రూప్ సామూహిక వివాహాలు జరిపిస్తోంది. ఇప్పటివరకూ 5 వేల మంది యువతులకు పెళ్లిళ్లు చేసింది.