Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి చేరుకున్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత వాయుసేన విమానంలో శంషాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా స్వాగతం పలికారు. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్తున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శ్రీశైలంలో ప్రసాద్ పథకం ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తర్వాత శివాజీ స్మారక కేంద్రాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు శ్రీశైలం నుంచి హైదరాబాద్‌లోని హకీంపేటకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర మంత్రులు సాదర స్వాగతం పలుకనున్నారు.