Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రవితేజ - శ్రీలీల జోడీగా రూపొందిన 'ధమాకా' ఈ నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది రవితేజ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. డిఫరెంట్ లుక్స్ తో ఆయన ఈ సినిమాలో సందడి చేశాడు. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 32 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. ఆల్రెడీ రెండు ఫ్లాపులతో ఉన్న రవితేజకి ఈ సినిమా రిజల్ట్ ఊరటను ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో హిట్ కొట్టాలనే శ్రీలీల కోరిక కూడా నెరవేరినట్టే. దగ్గరలో గట్టిపోటీ ఇచ్చే సినిమాలేవీ లేకపోవడం రవితేజకి కలిసొచ్చే అంశం. రవితేజ మాస్ యాక్షన్ .. శ్రీలీలే గ్లామర్ .. ఇద్దరూ కలిసి చేసిన మాస్ డాన్సులు .. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. భీమ్స్ సంగీతం .. కెమెరాల పనితనం ఈ సినిమా సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించాయనే చెప్పాలి. ఇక అటు రవితేజ .. ఇటు శ్రీలీల ఇద్దరూ కూడా మూడేసి ప్రాజెక్టులను లైన్లో పెట్టడం విశేషం.