Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పప్పుల చిట్టీ పేరుతో ఓ మహిళ సుమారు రూ.4కోట్లకు టోకరా వేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్ పేటలో చోటుచేసుకుంది. పతివాడ శ్రీలేఖ అనే మహిళ ఈ మోసానికి పాల్పడ్డారు. నెలకు రూ.300 చొప్పున ఏడాదికి రూ.3,600 చెల్లించాలని.. దీనికి బియ్యం, పప్పులు, నూనె తదితర 24 రకాల వస్తువుల్ని ఇస్తామని నమ్మించారు. దీంతో సుమారు 11వేల మంది చేరారు. గతేడాది 'ఏఆర్ బెనిఫిట్ ఫుడ్ సంక్రాంతి' కానుక పేరిట చిట్టీలో చేరిన వారందరికీ సక్రమంగా సరకులు అందజేసిన శ్రీలేఖ.. ఈ ఏడాది మాత్రం ఇవ్వలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు ఆమె ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఫలితం లేదని తెలియడంతో అనంతరం పోలీసులను ఆశ్రయించారు. గుర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.